విద్యా, వైద్యం మౌళిక సదుపాయాల కే ప్రాధాన్యం: ఎమ్మెల్యే జారే

–  ప్రజల అవసరాలు ఏమిటో నివేదిక రూపొందించింది..
– క్షేత్రస్థాయి సిబ్బంది గ్రామాల పై పూర్తి అవగాహన కలిగి ఉండాలి..
– ఐదేళ్ళ ప్రణాళిక కార్యాచరణ నేను చేపడతాం..
నవతెలంగాణ – అశ్వారావుపేట
ప్రజల అవసరాలు ఏమిటో మీరు నివేదిక ఇవ్వండి,ఐదేళ్ళ ప్రణాళిక కార్యాచరణ నేను అమలు చేస్తానని,నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట ఆదర్శంగా తీర్చిదిద్దుతానని స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు. పంచాయితీ కార్యదర్శులు,ప్రత్యేక అధికారులు పలు శాఖల అధికారులతో మంగళవారం స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో ఆయన మండల అభివృద్ది,అభివృద్ది పనుల పురోభివృద్ధి,ప్రజలకు ఇంకా కల్పించాల్సిన మౌళిక సదుపాయాలు పై సమీక్ష నిర్వహించారు. నా అయిదేళ్ళ పాలనలో విద్యా వైద్యం ప్రజలకు కావాల్సిన మౌళిక వసతులు పైనే ప్రత్యేక దృష్టి సారించానని అందుకు తగ్గట్టు గా గ్రామాల్లో ప్రజలకు కావాల్సిన మౌళిక సదుపాయాలు ను గుర్తించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.ప్రతీ ప్రభుత్వ ఉద్యోగి సంబంధిత గ్రామం పై పూర్తి అవగాహన తో పనిచేయాలని సూచించారు. ప్రత్యేకంగా పంచాయితీల్లో సోలార్ విద్యుత్ తో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను అని పైలెట్ ప్రాజెక్ట్ గా నా స్వంత గ్రామం గండుగులపల్లి ఏర్పాటు చేసి ఫలవంతం అయితే నియోజక వర్గం వ్యాప్తంగా పధకం అమలుకు శ్రీకారం చుడతాను అని అన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే ఉద్యోగులు పట్ల కఠినంగా వ్వవహరిస్తానని హెచ్చరించారు. పంచాయితీలు వారీగా నివేదికలను అధికారులు చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో ఎం.పి.పి శ్రీరామమూర్తి,కో – ఆప్షన్ సభ్యులు ఎస్.కే పాషా,ఎం.పి.టీ.సీ లు వేముల భారతి,సత్యవరుపు తిరుమల బాలగంగాధర్,తహశీల్దార్ క్రిష్ణ ప్రసాద్,ఎం.డీ.ఓ శ్రీనివాస్,ఐ.బి ఈ.ఈ కే.సురేష్ లు పాల్గొన్నారు.