క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయి: ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి

నవతెలంగాణ – పెద్దవూర
క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపోందిస్థాయని నాగార్జునసాగర్ ఎం ఎల్ ఏ కుందూరు జయవిర్ రెడ్డి అన్నారు. ఆదివారం మండలం లోని తుంగతుర్తి గ్రామం లో శ్రీ శ్రీ శ్రీ స్వయంభూ పార్వతీ సమేత సోమేశ్వర స్వామి ఉత్సవాలలో భాగంగా శివసాయి యూత్ ఆధ్వర్యంలో జరుగుతున్న  జాతీయ స్థాయి కబడ్డి పోటీలలో క్రీడాకారులను పరిచయం చేసుకొని ఎమ్మెల్యే మాట్లాడారు. నేటితరం విద్యార్థులు, యువతరం టెక్నాలజీ వైపు దూసుకెళ్తున్న ఈ తరుణంలో క్రీడలపై ఆసక్తిని పెంపొందించేలా క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. క్రీడలతో శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం పెంపొందడంతోపాటు ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడుతాయన్నారు. ప్రపంచంతో పోటీ పడుతూనే ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. శరీరానికి సరైన వ్యాయామం లేకపోతే రోగాల బారినపడే అవకాశం ఉంటుందన్నారు. ఒకే చోట కూర్చొని కంప్యూటర్‌ ఉద్యోగం చేసే వారు తప్పనిసరిగా ప్రతిరోజూ కొంత సమయాన్ని వ్యాయామం లేదా క్రీడలకు కేటాయించాలని తెలిపారు.క్రిడల వల్ల దేహదార్యుడంతో పాటు స్నేహాభావాన్ని పెంపొందించవచ్చన్నారు. క్రీడల ద్వారా సమాజంలో మంచి గుర్తింపు క్రీడాకారుడికి ఉంటుందన్నారు. మంచి స్నేహపూర్వక వాతావరణం లో ప్రశాంతంగా నిర్వహించు కోవాలని సూచించారు. అనంతరం గ్రామస్తులు కమిటీ సభ్యులు జయవిర్ ను ఘన సన్మానం చేశారు.ఈ కార్యక్రమం లో మాజీ జెడ్పి వైస్ ఛైర్మెన్ కర్నాటి లింగారెడ్డి, మాజీ ఎంపీపి రమావత్ శంకర నాయక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మల పల్లి చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా కాంగ్రేస్ సీనియర్ నాయకులు శిరసన గండ్ల లక్ష్మి నరసింహమ్మా రావు, ప్రముఖ కాంట్రాక్టర్ శిరసన గండ్ల ప్రదీప్ కుమార్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కట్టేబోయిన అనిల్ కుమార్,యూత్ కాంగ్రేస్ సీనియర్ కాంగ్రెస్ గడ్డంపల్లి వినయ్ రెడ్డి, గుంటుక పెద్ద సైదిరెడ్డి, దుగ్యాల శంకర్,జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకులు వాసశికర్ల వినయ్ రెడ్డి, ఎంపీటిసి రమావత్ జ్యోతి కృష్ణ జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి గొట్టిపాక కర్తయ్య ఇరుమాది శ్రీనివాస్ రెడ్డి,కబడ్డీ ఆర్గనైజర్ పల్లెబోయిన సత్యనారాయణ యాదవ్,మాజీ సర్పంచ్ సుంకి రెడ్డి ప్రభావతి సంజీవ రెడ్డి,రావుల వేణు,ఇరుమాది శ్రీనివాస్ రెడ్డి,యువకులు,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.