నిధుల గురించి శ్రమిస్తున్న ఎమ్మెల్యే: జీవి నరసింహ రెడ్డి

MLA struggling for funds: JV Narasimha Reddyనవతెలంగాణ – ఆర్మూర్  

ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కృషితోనే నియోజకవర్గ అభివృద్ధికి నిధుల గురించి శ్రమిస్తున్నారని బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ జీవి నరసింహ రెడ్డి, మాజీ చైర్మన్ కంచెట్టి గంగాధర్, పట్టణ అధ్యక్షులు ఉదయ్ లు అన్నారు. పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించినారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..  పట్టణంలో గల ప్రభుత్వ ఆసుపత్రికి డాక్టర్లను స్టాఫ్ నర్స్లను నియమించవలసిందిగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సంహను కోరగా అందుకు ఆయన స్పందించి  ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించిన ఆరోగ్య సిబ్బందిని నియమించడం జరిగింది. దీనిని  కాంగ్రెస్ నాయకులు తాముచేసినట్లు ప్రజలను మభ్యపెడుతున్నారని దీనిని తీవ్రంగా ఖండిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఆకుల శ్రీనివాస్ జిల్లా అధికార ప్రతినిధి జెస్సు అనిల్ ఆకుల రాజు పట్టణ ప్రధాన కార్యదర్శి  యుగంధర్ ప్రకాశ్ రాజేశ్వర్ రాజ్ కుమార్ పట్టణ యువ మోర్చా నాయకులు కలిగోట ప్రశాంత్ ఉదయ గౌడ్ భరత్ తదితరులు పాల్గొన్నారు.