నారాయణగిరి  సమ్మక్క సారలమ్మ లను దర్శించుకున్న ఎమ్మెల్యే కడియం

నవతెలంగాణ – ధర్మసాగర్
ఈ నెల ధర్మసాగర్ మండలం నారాయణగిరి గ్రామంలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లను సోమవారం స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి పర్యవేక్షించి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా జాతరకు అవసరమయ్యే మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని ఆయా సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. వచ్చే రెండేళ్ల లో ఊరినుండి గుడి వరకు, సీసీ రోడ్డు,లైటింగ్ ను,అమ్మవారి గద్దెల దగ్గర గచ్చు,టాయిలెట్స్ ,నీటి వసతుల ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానన్నారు.అలాగే జాతర ఏర్పాట్ల కోసం కృషి చేసిన దాతలను అభినందించారు.ఈ కార్యక్రమంలో మండల ఎమ్మార్వో,ఎంపిడిఓ, స్థానిక ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు అదికారులు,గ్రామస్తులు పాల్గొన్నారు.