
శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామిని శనివారం వేకువజామున కల్వకుర్తి శాసన సభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి, మాదవి దంపతులు దర్శించుకున్నారు. శ్రీశైల దేవస్థానాన్ని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యేలను ఆలయ పురోహితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి సన్మానం చేశారు. అనంతరం వారు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యేలను ఆలయ వేద పండితులు తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు.