మొక్కలు నాటిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ 

MLA Kavvampalli Satyanarayana who planted saplingsనవతెలంగాణ – శంకరపట్నం
శంకరపట్నం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో నల్ల శ్రీవాణి ఆధ్వర్యంలో సోమవారం 75వ వన మహోత్సవం కార్యక్రమాన్ని  నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ హాజరై మొక్కలు నాటారు. అనంతరం వివిధ గ్రామాలకు చెందిన సీఎం రిలీఫ్ పండ్ చెక్కులను  లబ్ధిదారులకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి,నాయకత్వంలో అన్ని కులమతాల ప్రజలకు లబ్ధిదారులకు పూర్తి సమ న్యాయం జరుగుతుందన్నారు.ఎవరైనా సీఎం రిలీఫ్ ఫండ్ కోసం తిమ్మాపూర్ క్యాంప్ ఆఫీసులో అప్లై చేసుకోవాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి బత్తిని శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గోపగాని బసవయ్య గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి గట్టు తిరుపతి,బండారి తిరుపతి,ఎండి ఇస్సాముద్దీన్, మొలంగూరి సదానందం,స్థానిక తహసీల్దార్ అనుపమ,ఏపీవో శారద, పల్లె పాపిరెడ్డి,తిరుపతి తదితరులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.