గ్రామాల అభివృద్ధికై ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ: ఎంపీపీ

నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
చౌటుప్పల్ మండలంలోని తూప్రాన్ పేట, కైతాపురం, ఎల్లగిరి, ఎల్లంబావి, కొయ్యలగూడెం, పీపల్ పహాడ్, అల్లాపురం, ఎనగండితండ, ధర్మోజిగూడెం, నేలపట్ల గ్రామాలలో ఎన్ఆర్ఈజీఎస్, హెచ్ఎండిఏ నిధులతో సీసీ రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులను మంగళవారం ఎంపీపీ తాడూరి వెంకట్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ తాడూరి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నాయకత్వంలో గ్రామాలన్నీ అభివృద్ధి పథంలో నడుస్తాయని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం లాగా కాకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నాణ్యమైన పనులు చేస్తామని అన్నారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నేతృత్వంలో ప్రజా పాలన ప్రజలకు అందిస్తామ ని తాడూరి వెంకట్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సందీప్ కుమార్ పిఆర్ ఏఈ సందీప్ రెడ్డి పీఏసీఎస్ వైస్ చైర్మన్ చెన్నగోని అంజయ్యగౌడ్ బ్లాక్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆకుల ఇంద్రసేనారెడ్డి, బోయ దేవేందర్ ఎంపీటీసీలు జెల్లా ఈశ్వరమ్మవెంకటేశం, దోసపాటి జ్యోతిజంగయ్యగౌడ్, తడక పారిజాత మోహన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెంచల శ్రీనివాస్, యాదయ్య, నాగరాజు, దేవేందర్ రెడ్డి, శివ, మల్లేష్, భూపాల్ రెడ్డి, వెంకటేష్, మోహన్ రెడ్డి, నరసింహా, అరుణ్, అశ్విని, పెంటయ్య, జనార్దన్ రెడ్డి, అచ్చిరెడ్డి, జంగయ్య, రాజునాయక్, శ్రీనివాస్ నాయక్, నీలు, శంకర్ నాయక్, మహేష్ నాయక్, నారాయణ, శ్రీహరి, భార్గవ్, శ్రీనివాస్, గుండు మల్లయ్య, యాదయ్య నరసింహ, నగేష్ గౌడ్, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.