మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

MLA Komatireddy Rajagopal Reddy who toured the mandalనవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం గ్రామంలో ఆందోల్ మైసమ్మ దేవాలయంలో బుధవారం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వారి సతీమణితో ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. అనంతరం ఆందోల్ మైసమ్మ బోనాల ఉత్సవాల వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. దేవలమ్మ నాగారంలో శ్రీ ఆది మహావిష్ణువు స్వయంభు లింగేశ్వర స్వామి ఆలయంలో ఏకాదశి ప్రత్యేక పూజలు అందుకున్నారు. ఆది మహావిష్ణువు పల్లకి సేవలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దంపతులు పల్లకి సేవలో పాల్గొన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల అనంతరం జరగాల్సిన క్యాబినెట్ మంత్రి వర్గ విస్తరణ వాయిదా పడిందని విలేకరులతో చెప్పారు. అదిష్టానం మదిలో ఎవరికి మంత్రివర్గ విస్తరణలో పదవులు ఇవ్వాలో అధిష్టానం చూసుకుంటుందని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతి ఒక్క రైతుకు 2 లక్షల రుణమాఫీ కార్యక్రమం రేపటి నుంచి జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి చౌటుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు మాజీ జెడ్పీటీసీ చిలుకూరి ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పబ్బు రాజు గౌడ్ పీఏసీఎస్ ఉపాధ్యక్షుడు చెనగోని అంజయ్య గౌడ్ దండు మల్కాపురం మాజీ ఎంపీటీసీ చిట్టెంపల్లి శ్రీనివాసరావు బ్లాక్ కాంగ్రెస్, టౌన్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఆకుల ఇంద్రసేనారెడ్డి బోయ దేవేందర్,నరసింహ గౌడ్ ఆదిమహావిష్ణువు దేవాలయ చైర్మన్ వరకాంతం జంగారెడ్డి ఈవో మోహన్ బాబు తదితర నాయకులు పాల్గొన్నారు.