
వైస్ ఎంపీపీ బాసిరెడ్డి శ్రీకాంత్ రెడ్డికి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం మండలంలోని కాన్గల్ గ్రామంలో వైస్ ఎంపీపీ బాసి రెడ్డి శ్రీకాంత్ రెడ్డి నూతన గృహ ప్రవేశం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంత రం మండలంలోని జప్తిలింగారెడ్డిపల్లి సమీపంలో గల సింగరాళ్ళ మల్లన్న దేవాలయం వద్ద జరిగిన ఆత్మీయుల సమావేశంలో పాల్గొన్నారు. కార్యక్ర మంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బూమ్ పల్లి మనోహరరావు, రొట్టె రాజమౌళి పంతులు, మండ ల పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ దోమల కొమురయ్య, ఎంపీటీసీ కొమ్ము శరత్, మాజీ మండల పార్టీ అధ్యక్షులు చిలువేరి మల్లారెడ్డి, నాయకులు తొయేటి ఎల్లం, బక్క కనకయ్య, పులిరాజు, గురువారెడ్డి, బాల్ రెడ్డి, నంట పరమేశ్వర్ రెడ్డి, రాజశేఖర్, నర్సింహు లు తదితరులు పాల్గొన్నారు.