బోనాల పండుగలో పాల్గొన్న ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి

MLA Kota Prabhakar Reddy participated in Bonala festival– మహంకాళమ్మా.. కరుణించు..
నవతెలంగాణ – మిరుదొడ్డి 
మహంకాళమ్మా కరుణించాలని, వర్షాలు కురిపించి కరువు నుండి రైతులను కాపాడాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వేడుకున్నారు. మిరుదొడ్డిలలో జరిగిన మహంకాళి బోనాల పండుగలో ఎమ్మెల్యే హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయం బాగుంటూనే, రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందన్నారు. ఈసారి సకాలంలో వర్షాలు లేక వరి నాట్లు ఆగిపోయాయని, దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. అమ్మవారి దయతో వరుణ దేవుడు కరుణించాలని వర్షాలు కురియాలని కోరారు..వర్షాల కోసం ప్రజలు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారన్నారు. కేసీఆర్ హయాంలో ప్రకృతి సహకరించిందని, సకాలంలో వర్షాలు కురియడంతో పాటు ప్రాజెక్టుల నుండి నీటిని వాగులకు, చెరువు కుంటలకు విడుదల చేయడంతో.. మేలు జరిగిందన్నారు. ఇప్పటకైనా ప్రభుత్వం మేలుకొని కూడవెల్లి వాగుతో పాటు మల్లన్న సాగర్ ప్రధాన కాలువ, కొండపోచమ్మ కాలువ ద్వారా దుబ్బాక నియోజకవర్గంలోని చెరువు కుంటలకు నీళ్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మురుదొడ్డి మండల అధ్యక్షుడు తోట అంజిరెడ్డి, వల్లలా సత్యనారాయణ, సూకురి లింగం, స్వామి, తోకల నగేష్, సంజీవరెడ్డి, స్వామి  పాటు రెడ్డి సంఘం సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.