నవతెలంగాణ – తొగుట
పేదల సంక్షేమమే ద్యేయంగా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కృషి చేస్తున్నారని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి పేర్కొ న్నారు. మంగళవారం మండలంలోని వెంకట్రావు పేట గ్రామానికి చెందిన జంగపల్లి నాగమణి,రేపాక స్వప్న, సుతారి రజిత, రేపాక స్వాతి లకు మంజూ రైన సీఎం సహాయానిది చెక్కులను ఎమ్మెల్యే ఆదేశాల మేరకు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఎంపీగా ఉన్న సమయంలో దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్ని శలు కృషి చేసిన కొత్త ప్రభాకర్ రెడ్డి నేడు ఎమ్మెల్యేగా పేద ప్రజల కోసం పాటు పాడుతున్నారని పేర్కొన్నారు. సీఎం సహాయానిధి ద్వారా చెక్కులు మంజూరు చేసిన ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం దసరా పండుగ సందర్బంగా గ్రామ పంచాయతీ కార్మికులకు దుస్తులు పంపిణీ చేశారు. కార్యక్రమం లో బీఆర్ఎస్ నాయకులు పిట్ల వెంకటయ్య, జీడిపల్లి గోవర్ధన్ రెడ్డి, బండారు స్వామి గౌడ్, పాత్కుల స్వామి, ఈదుగళ్ళ పర్శ రాములు, పాత్కుల బాలేష్, పిట్ల వెంకటేష్, కుర్మ లింగం, పులిగారి గణేష్, జహంగీర్, రాములు, అభి యాదవ్, మిద్దె సురేష్, జూపల్లి జహంగీర్, గంగోళ్ల వెంకటయ్య, హన్మోల్ల కిష్టయ్య, శంకర్, నాగయ్య, బాలరాజు తదితరులు ఉన్నారు.