ముఖ్యమంత్రిని కలిసిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి…

నవతెలంగాణ – భువనగిరి రూరల్ 
యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం జలాల్పూర్ గ్రామంలో ఉన్న స్వామి రామానంద తీర్థ గ్రామీణ అభివృద్ధి సంస్థను వృత్తి విశ్వవిద్యాలయంగా మార్పు చేయాలని వినతిపత్రం సమర్పించంగా అందుకు సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి తెలిపారు. త్రిబుల్ ఆర్  రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్చాలని కోరగా సీఎం  పరిశీలిస్తామని తెలిపారని, నియోజకవర్గంలోని భునాదిగాని కాలువ మరమ్మతులకు159.03 కోట్లు, ధర్మారెడ్డి పల్లి కాలువ మరమ్మతులకు 129.80 కోట్లు, పిల్లాయిపల్లి కాల్వ మరమ్మతులకు 95.60 కోట్లు నిధులు కేటాయించాలని కోరడం జరిగింది అందుకు సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారని అన్నారు.  తెలంగాణ సాయుధ రైతు పోరాటయోధుడు రావినారాయణరెడ్డి  విగ్రహానికి టాంక్ బండ్ పై ఏర్పాటు చేయాలని కోరగా సీఎం రేవంత్  సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.