నవతెలంగాణ- వలిగొండ రూరల్ : చావా ఫౌండేషన్ వారు పేదప్రజలకు చేస్తున్న సేవలు అభినందనీయం అని స్థానిక శాసన సభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని మాందాపురం గ్రామంలో చావా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిభిరంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ పల్లె పల్లెనా వైద్యం అనే నినాదంతో వారు ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారని,వారి సేవలు ఎంతో అభినందనీయం అని ఆయన అన్నారు.రోగులకు ఉచిత పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణి చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ నూతి రమేష్,జెడ్పీటీసీ వాకిటి పద్మ అనంత రెడ్డి, సర్పంచ్ సోలిపురం సాగర్ రెడ్డి,కుసంగి రాములు,వైద్యులు రాజ్ కుమార్,ఆశ్లేష తదితరులు పాల్గొన్నారు.