కర్ణాటక మంత్రిని సన్మానించిన ఎమ్మెల్యే కుంభం..

నవతెలంగాణ – భువనగిరి
కర్ణాటక మంత్రి బోస్ రాజు కొలనుపాకలోని జైన్ మందిర్ ఆలయానికి వస్తున్న సందర్భంగా ఆయనకు ముందుగా భువనగిరి పట్టణంలో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు.  అనంతరం ఆయన జైన్ మందిర్ కు చేరుకొని ఆలయాన్ని సందర్శించనున్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ తంగళ్ళపల్లి రవికుమార్, వలిగొండ ఎంపీపీ వెంకటేష్ మున్సిపల్ మాజీ చైర్మన్ బర్రె జహంగీర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కూర వెంకటేష్, నాయకులు  పిట్టల బాలరాజు, వడిచర్ల కృష్ణ పాల్గొన్నారు.