గ్రామాల అభివృద్దే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే కుంభం

నవతెలంగాణ – వలిగొండ రూరల్
గ్రామాలను అన్ని రంగాలలో అభివృద్ధి పర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అని స్థానిక శాసన సభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం మండలoలోని  అరూర్ లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో  జిల్లా పరిషత్ నిధులు 15 లక్షల 50   నిర్మించిన అదనపు  గది ప్రారంభం, గుర్నాథ్ పల్లి వెంకటాపురం మెయిన్ రోడ్డు మధ్యలో డ్యాంపై 4 లక్షల జిల్లా పరిషత్ నిధులతో   సిసి రోడ్డు శంకుస్థాపన, వెంకటాపురంలో ఎమ్మెల్సీ సిడిపి నిధులు 12 లక్షల వ్యయంతో నిర్మించిన కమ్యూనిటీ హాలు, ముద్దాపురంలో చౌటుప్పల్ లోని దివీస్ ల్యాబరేటరీ సౌజన్యంతో ఏర్పాటుచేసిన వాటర్ ఫిల్టర్ ను  ప్రారంభించారు. ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ గ్రామాలను అన్ని రంగాలలో అభివృద్ధి పర్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృత నిశ్చయంతో పని చేస్తుందని ఆయన అన్నారు.అనంతరo నరసాయగూడెం లోని అమరావతి ఫంక్షన్ హాలులో నిర్వహించిన జెడ్పిటిసి, ఎంపిటిసి లు 5 సంవత్సరాల పదవీ కాలం పూర్తి చేసుకొని పదవీ విరమణ చేస్తున్న సందర్భముగా ఎమ్మెల్యే వారికి ఈ పదవులకన్నా పెద్ద పదవులు నిర్వర్తించి ఉన్నత శిఖరాలకు చేరుకోని పేద ప్రజలకు సేవ చేయాలని సూచించారు. సమావేశంలో ఆయన పాల్గొని వారిని శాలువాలతో, పూలమాలలతో ఘనంగా  సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నూతి రమేష్, జెడ్పిటిసి వాకిటి పద్మా అనంత రెడ్డి, వైస్ ఎంపిపి బాత రాజు ఉమా బాల్ నర్సింహా, పాశం సతి రెడ్డి, గరిసె రవి, తుమ్మల యుగంధర్ రెడ్డి,గూడూరు శివశాoత్ రెడ్డి, గూడూరు శ్రీధర్ రెడ్డి, తుమ్మల వెంకట్ రెడ్డి, సోలిపురం సాగర్ రెడ్డి, జక్క వెంకట్ రెడ్డి, కేసరి రాం రెడ్డి, సురకంటి వెంకట్ రెడ్డి,  కంకల కిష్టయ్య,  లింగయ్య, చెరకు శివయ్య,బతిని సహదేవ,సుక్క ముత్యాలు, బుర్ర నర్సింహా, ఎంపిటిసి లు తదితరులు పాల్గొన్నారు.