తీన్మార్ మల్లన్న ను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలి : ఎమ్మెల్యే కుంభం

నవతెలంగాణ – భువనగిరి
నల్గొండ వరంగల్ ఖమ్మం ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ  అభ్యర్థి తీన్మార్ మల్లన్న భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక వైయస్సార్ ఫంక్షన్ హాల్ లో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు కూర వెంకటేష్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తీన్మార్ మల్లన్న స్థానిక శ్రీ లక్ష్మీనరసింహస్వామి  డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసిన స్థానికుడని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించుకోవాలని పట్టభద్రులను కోరారు. మల్లన్న గెలుపే లక్ష్యం గా కార్యకర్తలు నాయకులు ముందు కు పోవాలన్నారు.  మండలాల వారిగా పట్టభద్రుల లిస్టులు తయారు చేశామని ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ప్రచారం చేయాలన్నారు. ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలలోపే హామీలు నెరవేర్చామని చెప్పారు. మహిళలకు ఉచిత ప్రయాణం,  రూ. 500 కి గ్యాస్ సిలిండర్ అందజేస్తున్నట్లు చెప్పారు.  ఆగష్టు లో రైతులకు రెండు లక్షల రుణమాఫీ సిఏం రేవంత్ రెడ్డి చేయనున్నట్లు చెప్పారు. పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి   చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు ఖాయం అన్నారు. కార్యకర్తలు కష్టపడి పనిచేశారని 20వేల మెజారిటీ వస్తుందన్నారు. 2017లో మల్లన్న పోటీ చేస్తే నేను ప్రతి మండలం తిరిగి ప్రచారం చేశానని చెప్పారు.  ఈ కార్యక్రమంలో టిపిసిసి డెలిగేట్ రవి కుమార్, కౌన్సిలర్ పోత్నక్  ప్రమోద్ కుమార్, మాజీ చైర్మన్ బర్రె జహంగీర్, ఎంపీపీ నిర్మల, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎలిమినేటి కృష్ణారెడ్డి పాల్గొన్నారు.