డిసెంబర్ 1 నుంచి 9 తేదీ వరకు నిర్వహించే ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలలో భాగంగా సోమవారం రోజు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని స్థానిక శాసన సభ్యులు కుంభ అనిల్ కుమార్ రెడ్డి,యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు, డిసిపీ రాజేష్ చంద్ర,రెవిన్యూ అదనపు కలెక్టర్ వీరా రెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గంగాధర్ తో కలసి ప్రారంభించారు. 104 మంది వివిధ శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది రక్తదానం చేశారు.జిల్లా జె ఏ సి చైర్మన్ ఉపేందర్ రెడ్డి, జగన్మోహన్ ప్రసాద్,తెలంగాణ,గెజిటెడ్ ఉద్యోగుల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, కార్యదర్శి ఖదీర్ మహమ్మద్, యూనియన్ కార్యదర్శి శ్రీకాంత్, రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శశికాంత్, పంచాయతీ కార్యవర్గ సంఘం జిల్లా అధ్యక్షుడు చంద్రారెడ్డి, చైతన్య కృష్ణ ఉద్యోగులు సంఘ నాయకులు రక్త దానం శిబిరంలో రక్తదానం చేశారు. ఈ కార్యక్రమం లో జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.