నేడు పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొననున్న ఎమ్మెల్యే కుంభం

నవతెలంగాణ – వలిగొండ రూరల్
మండలంలోని వివిధ గ్రామాలలో సంగెం,నాగారం,లోతుకుంట, నర్సాయిగూడెం, అరురు, మత్స్యగిరి గుట్ట వద్ద, వేములకొండ, ఎం తుర్కపల్లి,రెడ్ల రేపాక, టేకులసోమారంలో గ్రామాలలో రూ.2 కోట్ల 50 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన, గోకారం గ్రామంలో ఎమ్మెల్సీ సిడిపి నిధులు 13 లక్షల 50 వేలతో నిర్మించిన కమ్యూనిటీ హాలు ప్రారంబోత్సవం లో స్థానిక శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొంటున్నట్లు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పాశం సత్తి  రెడ్డి శనివారం  ఒక ప్రకటనలో తెలిపారు.