సోమవారం నాడు జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు మద్నూర్ మండలంలో విస్తృతంగా పర్యటించారు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మొక్కలను నాటారు మద్నూర్ మండలం లోని సోమూర్, అలాగే హిప్పర్గా గ్రామాలలో స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఎస్డిఎఫ్ నిధులతో సి.సి రోడ్డు నిర్మాణానికి పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణం కోసం భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మద్నూర్ మండల ప్రత్యేక అధికారి కామారెడ్డి జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ ఎంపీడీవో రాణి ఎంపీవో వెంకట నరసయ్య కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దరాస్ సాయిలు స్థానిక గ్రామ కార్యదర్శి సందీప్ వివిధ శాఖల అధికారులు ఆయా గ్రామాలకు ప్రత్యేక అధికారులు కార్యదర్శులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు .