వాడి బ్రిడ్జి నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన 

– త్వరలో రూరల్ నియోజకవర్గంలోని అన్ని బ్రిడ్జీలు పూర్తి చేస్తాం : రూరల్ ఎమ్మెల్యే ఆర్ భూపతిరెడ్డి 
నవతెలంగాణ – ధర్పల్లి 
రూరల్ నియోజకవర్గంలోని ఆయా గ్రామా ప్రజల చిరకాల సమస్య తీరనుందని నిజామాబాదు రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డా.రేకులపల్లి భూపతిరెడ్డి అన్నారు. శుక్రవారము అయన తొమ్మిదిన్నర కోట్లతో చేపట్టే  వాడి గ్రామా బ్రిడ్జి పనులకు శంకుస్థాపన చేశారు. ఈసందర్బంగా అయన మాట్లాడారు. వాడి వల్ల ఈగ్రామ ప్రజలతోపాటు, హొన్నజీపేట్, గడ్కోల్ గ్రామాల చిరకాల స్వప్నం నెరవేరనుంది అన్నారు.బ్రిడ్జి  సరిగ్గాలేక ప్రతిసంవత్సరం వర్షాకాలంలో ఇక్కడి ప్రజలకు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, వర్షాలు కురుస్తే ఈగ్రామాల ప్రజలు ఇతర గ్రామాలకు వెళ్లకుండా ఉండేవారని అన్నారు. ఇట్టి పనులు శరవేగంగా ప్రారంభించి, పనులు పూర్తి చేసేవిధంగా అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. రాబోయే వర్షాకాలం నాటికి పనులు పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు తొలగించేందుకు పనులు త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అలాగే రూరల్ నియోజకవర్గంలో అవసరము ఉన్న ప్రతి చోట బ్రిడ్జిలు నిర్మించేందుకు కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకుంటుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజలకు ఇబ్బందులు ఉండకుండా అభివృద్ధి జరుగనుందని అన్నారు. కార్యక్రమములో గ్రామ సర్పంచ్ రొండ్ల బాగవ్వా, ఉప సర్పంచ్ వెంకట్ రెడ్డి, మండల అధ్యక్షుడు ఆర్మూర్ చిన్న బాలరాజ్, నాయకులు మనోహర్ రెడ్డి, జెసీబీ శ్రీనివాస్, మిట్టపల్లి గంగారెడ్డి, పుప్పాల సుభాష్, గడీల శ్రీరాములు, హొన్నజిపేట సర్పంచ్ భగవాన్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, జాన్ రెడ్డి, సుభాష్ రెడ్డి, ప్రభు, ఆయాగ్రామాల సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.