గురుద్వార్ ను సందర్శించిన ఎమ్మెల్యే, నాయకులు

MLAs and leaders visited the Gurdwaraనవతెలంగాణ – మద్నూర్
గత రెండు రోజులుగా మహారాష్ట్రలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా అక్కడ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావుతో పాటు మద్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముఖ్య యువ నాయకులు ఎమ్మెల్యే వెంట పాల్గొంటున్నారు. సోమవారం ఎమ్మెల్యే నాందేడ్ జిల్లా కేంద్రంలో గల గురుద్వార్ ను సందర్శించి దర్శించుకున్నారు. ఆయన వెంట ఎమ్మెల్యే అత్యంత సన్నిహితుడు సాయి పటేల్, సీనియర్ నాయకులు హనుమాన్ స్వామి, ఎక్స్ ఎంపీపీ ప్రజ్ఞ కుమార్, యూత్ నాయకులు హనుమంతు యాదవ్, మద్నూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పరమేష్ పటేల్, నాగేష్ పటేల్, సచిన్, బాలు యాదవ్, అమూల్, వట్నాల రమేష్ బాలు, షిండే, సంతోష్ మేస్త్రి, తదితరులు ఎమ్మెల్యే వెంట పాల్గొన్నారు.