కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సోమవారం శంషాబాద్ విమానాశ్రయం నుంచి లండన్ బయలుదేరారు. ఈనెల 5 నుంచి మూడు రోజుల పాటు లండన్ వేదికగా జరుగనున్న ప్రపంచ పర్యాటక ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు పలువురు శాసనసభ్యులతో కలిసి లండన్ వెళ్తున్నట్లు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తెలిపారు.