కళ్యాణలక్ష్మి చెక్కులను అందిస్తున్న ఎమ్మెల్యే మదన్మోహన్

– ఎల్లారెడ్డిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా:  ఎమ్మెల్యే మదన్ మోహన్
నవతెలంగాణ – తాడ్వాయి 
ఎల్లారెడ్డి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ తెలిపారు. తాడ్వాయి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఆయన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్లారెడ్డి నియోజకవర్గము అన్ని రంగాల్లో వెనుకబడి పోయిందని తెలిపారు. ఎల్లారెడ్డి నియోజకవర్గాన్ని గతంలో పాలించిన నాయకుల లోపం వల్లే అభివృద్ధికి పూర్తిగా దూరమైందని తెలిపారు. తాడ్వాయి మండలం తన సొంత మండలం అని మండలాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతానని తెలిపారు. తాడ్వాయి మండలంలో తాగునీటి ఎద్దడి ఎక్కువగా ఉందని తాగునీటి ఎద్దడి నివారణకు ఇప్పటికే రూ. కోటి మంజూరు చేసినట్లు తెలిపారు మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం కోసం అన్ని శాఖల మంత్రులను ప్రత్యేకంగా కలుస్తూ నిధుల సేకరణకు కృషి చేస్తున్నానని వివరించారు. అధికారులు సమయస్ఫూర్తి పాటిస్తూ అభివృద్ధికి సహకరించాలని తెలిపారు ఈ సందర్భంగా ఏడుపురికి కళ్యాణ లక్ష్మి చెక్కులను అందించారు. అనంతరం కృష్ణాజివాడిలో గత రెండు రోజుల క్రితం కాలిపోయిన నివాసపు ఇల్లు బాధితుడు జంగం శివకృష్ణ ను పరామర్శించి ఓదార్చారు ఈ కార్యక్రమంలో ఆర్డీవో రంగనాథ్, తాసిల్దార్ రహీముద్దీన్ ,ఎంపీడీవో, ఎంపీపీ రవి, వైఫ్ ఎంపీపీ నర్సింలు ,జెడ్పిటిసి రమాదేవి నారాయణ నాయకులు వెంకట్రామిరెడ్డి సాయి రెడ్డి సుగుణాకర్ రెడ్డి ,జలంధర్ రెడ్డి, రాజు ,షౌకత్ అలీ తదితరులు పాల్గొన్నారు.