ఎమ్మెల్యే మహేష్‌ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి

– బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మంత్రి కేటీఆర్‌
– కేసీఆర్‌ హ్యాట్రిక్‌ సీఎం ఖాయం
– ఎమ్మెల్యే మహేష్‌ రెడ్డి
– జనసంద్రమైన కుల్కచర్ల
నవతెలంగాణ-కుల్కచర్ల
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోత ల పథకం ద్వారా ముందుగా కుల్కచర్ల మండలానికి సాగునీరు వస్తుందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మంత్రి కేటీఆర్‌ అన్నారు. సోమవారం మండ ల కేంద్రంలో రోడ్డు షో నిర్వహించారు. అభిమానులు కార్యకర్తలు భారీగా తరలి రావ డంతో కుల్కచర్ల జన సంద్రమైంది. అంతకుముందు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆయన మాట్లా డుతూ.. ఎమ్మెల్యే మహేష్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపిం చా లన్నారు. కాంగ్రెస్‌ 6 గ్యారెంటీ పథకాలు ఎమో 6 నెలలకు ఒకసారి సీఎం మారడం మాత్రం గ్యారెంటీ అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మరో 4 కొత్త పథకాలు తీసుకు వస్తామన్నారు. రాష్ట్రంలోని 93 లక్షల కుటుంబాలకు కేసీఆర్‌ బీమా పథకం అమలు చేస్తామన్నారు. గిరిజనుల రిజర్వేష న్లు 10 శాతానికి పెంచామని తండాలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేశామ న్నారు. ప్రతి తండాలో సేవాలాల్‌ భవ నం, గ్రామాల్లో మహిళల సౌకర్యానికి మ హిళా భవనాలను నిర్మిస్తామన్నారు. గండ్వీ డ్‌, మహమ్మ దాబాద్‌ మండలాలను తిరిగి వికారాబా ద్‌ జిల్లాలో కలుపుతామన్నారు. కేసీఆర్‌ ఒక్కడిని ఎదు ర్కోవటానికి ఢిల్లీ నుంచి నాయకులకు దిగుతున్నారని వారికి తగిన గుణపాఠం చెప్పాలన్నా రు. ఎమ్మెల్యే మహేష్‌ రెడ్డి మాట్లాడుతూ..సీఎం కేసీఆర్‌ హ్యాట్రిక్‌ సాధించడం ఖాయమన్నారు. గ్రా మాలను అభివద్ధి చేశామని మరింత అభివద్ధి చేస్తా నన్నారు. ప్రజల అభిప్రాయం మేరకు మహ్మదాబాద్‌, చౌడపూర్‌ నూ తన మండలాలను ఏర్పాటు చేశామని పరిగి నియోజకవర్గంలో విద్యాపరంగా ఎంతో అభివద్ధి జరిగిందని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేశామని. కుల్కచర్ల మండలానికి జూనియర్‌ కళా శాల, పరిగిలో ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ఏర్పాటు కు కషి చేస్తానన్నారు. తండాలను గ్రామపంచాయతీ లుగా ఏర్పాటు చేసి ఎంతోమంది ప్రజాప్రతినిధు లను తయారు చేశామన్నారు. కార్యక్రమంలోమంత్రి మహేందర్‌రెడ్డి, ఎంపీ రంజిత్‌ రెడ్డి, రాష్ట్ర నాయకు లు కాసాని వీరేష్‌, అనిల్‌ రెడ్డి, ప్రతిమా రెడ్డి, దీప్తి రెడ్డి, ఎంపీపీ సత్యమ్మహరిశ్చం దర్‌, జెడ్పీటీసీ రాం దాస్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ హరికష్ణ, కుల్కచర్ల, చౌడపూర్‌ మండలాల అధ్యక్షు లు సేరి రాంరెడ్డి, సుధాకర్‌ రెడ్డి, నాగేందర్‌ గౌడ్‌, నాగి రెడ్డి, రైతు సమ న్వయ సమితి మండలాధ్యక్షుడు కేబీ రాజు, నాగ రాజు రాజప్ప, కష్ణయ్యగౌడ్‌, మఠం రాజశేఖర్‌, వెంకట్‌, పలుగ్రా మాల సర్పంచులు ఎంపీటీసీలు నాయకులు కార్య కర్తలు పాల్గొన్నారు.