క్రీడలను ప్రోత్సహించడం అభినందనీయం: ఎంఎల్ఏ మహేశ్వర్ రెడ్డి..

Promoting sports is commendable: MLA Maheshwar Reddy..నవతెలంగాణ – సారంగాపూర్
ఆలయ కమిటీ క్రీడలను ప్రోత్సహించడం అభినందనీయం అని ఎంఎల్ఏ మహేశ్వర్ రెడ్డి అన్నారు. మండలంలోని పొట్య గ్రామపంచాయతీ పరిధిలోని బండ రేవు తండాలోని నాను మహారాజ్ 32వ జాతారోత్సవానికి నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి హాజరై నాను మహారాజ్, జగదంబ దేవి ఆలయలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు ఎంఎల్ఏ మహేశ్వర్ రెడ్డి ని శాలువా పూలమాలలతో సత్కరించారు. అనంతరం ఆటల పోటీలు ప్రారంభించారు. గెలుపొందిన జట్టుకు బహుమతులు అందజేసి మాట్లాడారు. ఆలయ నిర్వాహకులు జాతర సమయంలో కబడ్డీ, వాలీబాల్, క్రికెట్, కుస్తీ వంటి వివిధ క్రీడల నిర్వహణను యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. క్రీడలతో మానసిక ఆనందం తోపాటు క్రీడాకారులకు ఉపాధి ఉద్యోగాలు సైతం లభిస్తాయని అన్నారు. గత కొన్ని సంవ్సరాలుగా ఆలయ కమిటీ క్రీడలను నిర్వహించడాన్ని అభినందించారు. అనంతరం జాతర నిర్వహణకు రూ.32 వేలు కమిటీ సభ్యులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి, రావుల రామ్ నాథ్,నాయకులు మెడిసెమ్మ రాజు, విలాస్, రామ్ శంకర్ రెడ్డి, గంగారెడ్డి, కె.రాజేశ్వర్ రెడ్డి, కరుణ సాగర్ రెడ్డి, వీరయ్య, ఎల్లన్న, నరేష్, విజయ్, దావూజి నాయక్, నారాయణ నాయకు పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు.