మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ని కలిసిన ఎమ్మెల్యే మెచ్చా

నవతెలంగాణ – అశ్వారావుపేట
తెలంగాణ దేవాదాయ, అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ని సోమవారం అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు  మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా పోడు సర్వే జరిగినప్పటికీ పలువురికి పాస్ పుస్తకాలు అందకపోవడం పైనా,నియోజక వర్గంలోని పలు పూర్వ ఆలయాల పునరుద్దరణ,నూతన ఆలయాల నిర్మాణం గురించి మంత్రి దృష్టికి తీసుకెళ్ళారు.  సానుకూలంగా స్పందించిన ఆయన సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
అనంతరం హైదరాబాద్ లో ఐటిడిఎ సీఈ ని మెచ్చా నాగేశ్వరరావు, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే  ఆత్రం సక్కు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నియోజకవర్గంలో పలు సమస్యలు పైనా, జరగాల్సిన అభివృద్ది గురించి వారితో చర్చించారు. ఆయన వెంట బోయినపల్లి సుధాకర్,మోటూరు మోహాన్ లు ఉన్నారు.