
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఎన్నికల ప్రక్రియలో భాగంగా బదిలీ పై వచ్చిన కలెక్టర్ ప్రియాంక అల,ఐటిడిఎ భద్రాచలం పి.ఒ ప్రతీక్ జైన్ లను అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు మంగళవారం వారి ఇరువురిని వేర్వేరుగా మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుఛ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. మొదటి సారి వారితో భేటీ అయిన నియోజక వర్గం లో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఆరు గ్రామాల్లో ఆర్ఒఎఫ్ఆర్ పాస్ పుస్తకాలు నిలిచిపోయిన నేపథ్యంలో వాటిని వెంటనే మంజూరు చేయాలని కోరారు. ఆయన వెంట దమ్మపేట జెడ్.పి.టి.సి పైడి వెంకటేశ్వరరావు,ఎంపీపీ సోయం ప్రసాద్, ఎర్ర వసంత్ రావు, పామర్తి వెంకటేశ్వరరావు, మొండివర్రె ఎంపిటిసి శివ, సోడెం గంగరాజు, దొడ్డ ప్రసాద్ తదితరులు ఉన్నారు.