
సీఎం కేసీఆర్ నేతృత్వంలో పనిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వ పథకాలతో సామాజిక ప్రయోజనం కంటే ప్రతీ కుటుంబానికి వ్యక్తిగతంగా నే అత్యధిక మేలు జరుగుతుందని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు.పెరిగిన వికలాంగుల ఫించన్ ప్రొసీడింగ్స్,కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ ని గురువారం స్థానిక గిరిజన భవన్ లో ఆయన లబ్ధిదారులకు అందజేసారు. ఈ సందర్భంగా పురుడు పోసుకున్న దగ్గర నుండి వృద్దాప్యం వరకు ప్రతీ కుటుంబం ఏదో ఒక పధకంలో లబ్దిదారులు గా ఉన్నారని తెలిపారు.కేసీఆర్ కిట్,అంగన్వాడీ లో పోషకాహారం,బడిలో ఉచిత విద్యాభ్యాసం,కళాశాల విద్యకు ఆశ్రమ పాఠశాలలు,అనారోగ్యంతో సీఎం ఆర్ఎఫ్,రైతులకు ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు భీమా, వృద్ధాప్య ఫించన్ ఆంటూ ప్రభుత్వ అమలు చేస్తున్న పథకాలను ఆయన ఏకరువు పెట్టారు.
నియోజకవర్గం మరింత అభివృద్ధికి రానున్న సాధారణ ఎన్నికల్లో మళ్ళీ ఓట్లు వేసి ఆశీర్వదించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అభివృద్ధికి అడిగిన వెంటనే నిధులు మంజూరు చేస్తున్న సీఎం కేసీఆర్ నియోజకవర్గ అభివృద్ధికి పూర్తి భరోసా ఇస్తున్నారని,సమైక్య పాలనలో నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయటం,బంగారు తెలంగాణ నిర్మాణం సీఎం. కేసీఆర్ పాలనలో బీఆర్ఎస్ తోనే సాధ్యమని స్పష్టం చేశారు.దేశంలోని ఇతర రాష్ట్రాలకు సీఎం కేసీఆర్ ఆదర్శవంతమైన సమర్థ పాలన అందించటమే కాకుండా సబ్బండ వర్గాల ఆర్ధిక పరిపుష్టి దండే దశగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని వివరించారు.ప్రజల కష్టాలు తెలిసిన ఏకైక సీఎం కేసీఆర్ మాత్రమేనని,ఆయన పాలనలో అన్ని వర్గాల ప్రజలు, రైతులు సుభిక్షంగా ఉన్నారని, అటువంటి సీఎంను రానున్న ఎన్నికల్లో తిరిగి గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని గుర్తు చేశారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకుని కేసీఆర్కు బహుమతిగా అందించాలని కోరారు. గతంలో పాలకులు కేవలం రాజకీయాల కోసమే ప్రాకులాడారని, కానీ సీఎం కేసీఆర్ ప్రతి ఒక్క వర్గం వ్యక్తిగత అభివృద్ధి, సంక్షేమానికే ప్రాధాన్యత నిస్తున్నారని అన్నారు తెలంగాణ సంక్షేమాన్ని చూసి ఇతర రాష్ట్రాలు కూడా కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, అందుకే టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ మార్చి దేశ ప్రజలకు సేవ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఏ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ భారతీయులే రోజునని, వారి అభివృద్ధిని పాలకులు గుర్తించినప్పుడే రాజకీయ సార్ధకత సాధ్యమవుతుందని, తెలంగాణ ప్రజల క్షేమాన్ని కోరుకునే కేసీఆర్ దేశ ప్రజలు కూడా బాగుండాలని ఆకాంక్షిస్తున్నారని. చెప్పారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో హేళన చేసిన నాటి పాలకులు నేడు ఈ ప్రాంత అభివృద్ధి, సంక్షేమ పధకాలను చూసి ముక్కున వేలేసుకుంటున్నారని, ప్రతిపక్ష పార్టీల మాయ మాటలను నమ్మి సీర్ లాంటి సమర్థ పాలకుడిని నిర్లక్ష్యం చేయ్యొద్దని సూచించారు. గతంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పదకాలను బీఆర్ఎస్ పాలనతో పోల్చి చూసుకోవాలని, ప్రతి ఇంటికీ సంక్షేమ ఫలాలు- అందించటంతో పాటు ప్రజాభీష్టం మేరకు అభివృద్ధి సాధించటం తన లక్ష్యమని, మీరు వచ్చే ఎన్నికల్లో తిరిగి ఆశీర్వదిస్తే నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు కంకణబద్ధుడిపై కష్టపడి పని చేస్తానని హమీ ఇచ్చారు. కార్యక్రమంలో దళిత బంధు నియో జకవర్గ ప్రత్యేకాధికారి సీతారాం నాయక్, డీసీసీబీ డైరెక్టర్ నిర్మల పుల్లారావు, అశ్వారావుపేట సొసైటీ అధ్యక్షులు చిన్నంశెట్టి సత్యనారాయణ, నియోజకవర్గ మండలాల జడ్పీటీసీలు, ఎంపీపీలు, వైఎస్ ఎంపీపీలు, సర్పంచ్లు, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు, పలువురు దివ్యాంగులు, అధికారులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.