ఆయిల్ఫెడ్ లో పలు అభివృద్ది పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే మెచ్చా…

– హాజరైన చైర్మన్ కంచర్ల,ఎం.డి సురేందర్ లు…
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఆయిల్ఫెడ్ సంస్థ లో నిర్మించిన పలు అభివృద్ది పనులను ఆదివారం స్థానిక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, చైర్మన్ కంచర్ల రామక్రిష్ణా రెడ్డి, ఎం.డి సురేందర్ లు ప్రారంభించారు. నారంవారిగూడెం సమీపంలో గల ఆయిల్ఫెడ్ కు చెందిన ఎ బ్లాక్ లో నిర్మించిన అతిధి గృహం, ఆయిల్ ఫాం పరిశ్రమ ప్రాంగణంలో నిర్మించిన ఫార్మర్ షెడ్ (రైతులు విశ్రాంతి గది)లను వారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ సుధాకర్ రెడ్డి, డి.హెచ్.ఎస్.ఒ జినుగు మరియన్న, డి.ఒ బాలక్రిష్ణ,మేనేజర్ లు నాగబాబు,కళ్యాణ్ గౌడ్,రైతు బంధు జిల్లా అధ్యక్షులు రావు జోగేశ్వరరావు, ఎం.పి.పి శ్రీరామమూర్తి,జెడ్.పి.టి.సి వరలక్ష్మి, మాజీ జెడ్.పి.టి.సి జేకేవీ రమణారావు, రైతు సంఘం నాయకులు కొక్కెరపాటి పుల్లయ్య, కాసాని చంద్రమోహన్, ఆలపాటి రాంమోహన్ రావు(రాము), పిన్నమనేని మురళి, నాయకులు బండి పుల్లా రావు, మందపాటి రాజమోహన్ రెడ్డి, నార్లపాటి రాములు తదితరులు పాల్గొన్నారు.