సీఎం రేవంత్ ను కలిసిన ఎమ్మెల్యే..

నవతెలంగాణ – ఆర్మూర్   

రైతుల సమస్యలపై చర్యలు తీసుకోవాలని, ధాన్యం కొనుగోలు ఇతరత్రా సమస్యలు పరిష్కరించాలని స్థానిక ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. సచివాలయంలో  శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీ కలిసి సమస్యలను పరిష్కరించాలని కోరినారు. వీరితో పాటు ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, రామారావు పటేల్ తదితరులు పాల్గొన్నారు.