కేంద్ర మంత్రిని కలిసిన ఎమ్మెల్యే

నవతెలంగాణ – ఆర్మూర్ 

కేంద్ర మంత్రి వర్యులు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ని హైదరాబాదులో వారి ఇంటి వద్ద మంగళవారం నాడు ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కిషన్ రెడ్డి కి ఉగాది శుభాకాంక్షలు తెలియజేయడం జరిగిందని అలాగే మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్చార్జిగా అనుసరిస్తున్న విధివిధానాలను తెలియజేయడం జరిగింది. పార్లమెంట్ పరిధిలో ఎంపీ ఎన్నికల కోసం చేయాల్సిన విధానలను చర్చించడం జరిగింది, పార్టీ పటిష్టత కోసం నిరంతరం కృషి చేయాలని కిషన్ రెడ్డి చెప్పారు అని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి తెలిపారు.