నవతెలంగాణ-తాంసి
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలను సీఎం రేవంత్‌రెడ్డి తప్పక నెరవేర్చాలని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. బుధవారం భీంపూర్ మండలంలోని అందర్బంద్ గ్రామంలో నిర్వహించిన చెక్కుల పంపిణీ కార్యక్రమానికి బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మొదటగా గ్రామంలో సవారీ షెడ్డు నిర్మాణానికి భూమిపూజ, గిరిజన ఆశ్రమ పాఠశాలలో వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా పాఠశాల ఆవరణలో మొక్కలను నాటారు. అనంతరం మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన 24 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను డీసీసీబీ చైర్మన్ అడ్డి బోజరెడ్డితో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కళ్యాణలక్ష్మి చెక్కులు అందజేయడం సంతోషంగా ఉందన్నారు. రేవంత్‌రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీలో కల్యాణలక్ష్మి పథకంలో భాగంగా నగదుతోపాటు తులం బంగారం కూడా అందజేయాలని డిమాండ్ చేశారు. ఆశ్రమ పాఠశాలల్లో గిరిజన విద్యార్థిని విద్యార్థులకు అన్ని సదుపాయాలు కల్పించాలని శిథిలావస్థలో ఉన్నటువంటి భవనాలు తొలగించి నూతన భవనాలకు ప్రత్యేక నిధులు విడుదల చేయాలని ఏ ఒక్క విద్యార్థి కూడా చదువుకు దూరం కాకుండా పాఠశాల సిబ్బంది ప్రతి గిరిజన గ్రామాలకు వెళ్లి విద్యార్థులను హాస్టల్లో చేర్చుకొని మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం పెట్టాలన్నారు. అనంతరం మాజీ జడ్పీటీసీ సుధాకర్ అనారోగ్యంగా ఉండడంతో ఇంటికి వెళ్లి ఆయన యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, మండల కన్వీనర్ నాగయ్య, మాజీ ఎంపీపీ సంతోష్, ప్రీతంరెడ్డి, అనిల్, గోవర్ధన్ యాదవ్, మాజీ సర్పంచులు లింబాజి, లస్మన్న, కల్చప్ యాదవ్, మాజీ ఎంపీటీసీ మహేందర్, నితిన్, స్వామి, ఆఫ్రోజ్, అశ్విన్, రౌఫ్, శంకర్, అజరు, దేవేందర్‌రెడ్డి, పాల్గొన్నారు.