భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి: ఎమ్మెల్యే నాగరాజు

నవతెలంగాణ – ఐనవోలు: మండల కేంద్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ మల్లికార్జున స్వామిని  వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు దర్శించుకున్నారు. దైవదర్శన అనంతరం అన్ని ప్రభుత్వ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించినారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతనంగా ఏర్పాటు చేసిన దేవస్థాన కమిటీ డైరెక్టర్లు, ప్రభుత్వ అధికారుల సమన్వయంతో లోటుపాట్లను సవరించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు, అవాంచనియ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసి ఆలయ అభివృద్ధి కొరకు వీఐపీ దర్శనం ద్వారా వచ్చే భక్తులకు విఐపి పాసులు రద్దుచేసి పూర్తిగా పారదర్శకంగా ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా చూడాలన్నారు.
విఐపి దర్శనానికి 500 రూపాయల టికెట్ జారి చేయడం జరిగింది. గత పది సంవత్సరాల భారత రాష్ట్ర సమితి పార్టీ పాలనలో శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయాన్ని రాజకీయ నాయకులు అడ్డు అదుపు లేకుండా దేవాలయాన్ని అభివృద్ధిపరిచేది పోయి దేవుని సొమ్మును స్వాహా చేసిన ఉదంతాలు మా దృష్టికి రావడం జరిగిందన్నారు. ఇక నుండి అలాంటి సంఘటనలు జరగకుండా వారానికి ఒకసారి దేవాలయంపై అధికారుల తీర్పుతెన్నలపై సమీక్ష సమావేశంతో పాటు అక్రమార్కులపై కొరడా జోలపించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య ఆలయ ధర్మకర్తల మండల సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.