నవతెలంగాణ – ఆర్మూర్
నియోజకవర్గంలోని గ్రామాలను అభివృద్ధి చేసే బాధ్యత నాది అని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. నియోజక వర్గంలోని డొంకేశ్వర్ నుండి నుతప్పల్లి లోంకరమాలయం మీదుగా కోటి32లక్షల తో బిటి రోడ్డు పనులను సోమవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డోంకేశ్వర్ చుట్టూపక్కల గ్రామాలను అన్ని అభివృద్ధి చేసే బాధ్యత తనది అని లింక్ రోడ్లు నూతన రోడ్లకు నిధులు ఇప్పించే బాధ్యత తనది అని పార్టీలకు అతీతంగా అభివృద్ధి కి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు సురేందర్, సంతోష్ రెడ్డి, మరంపల్లి గంగాధర్, చిన్న,విడిసి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.