నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణ కేంద్రంలో అమర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ఆదివారం ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ప్రారంభించినారు .ఈ కార్యక్రమంలో వైద్యులు బోనికే అమర్ బాబు వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.. పట్టణంలో పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేసినారు.. ఈ కార్యక్రమంలో వైద్యులు ,,అసెంబ్లీ కన్వీనర్ పాలెపు రాజు తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని వాసవి కన్యక పరమేశ్వరి ఆలయంలోని ప్రత్యేక పూజలు నిర్వహించినారు.
పీ.యం.పీ.భవనంలో : మండల అర్ యం పి, పియంపి అసోసియేన్ ఆఫ్ తెలంగాణ డైరీ ,క్యాలెండర్ ఆవిష్కరణ లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్ ఎం పి వైద్యులు అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉపయోగించుకుంటారు అత్యవసర సమయాల్లో ప్రథమ చికిత్స కానీ వ్యాధి తీవ్రత ఎక్కువా కాకుండా చూస్తారు అని, అర్ ఎం పి ,పి యం పి వైద్యులు కోసం భవన నిర్మాణానికి తన తోడ్పాటు అందిస్తాను అని అన్నారు .ఈ కార్యక్రమంలో అర్ ఎంపీ అసోసియేషన్ అధ్యక్షుడు సాయిలు,సెక్రటరీ శ్రీనివాస్,రంజిత్, తిరుపతి,నరేందర్ తదితరులు పాల్గొన్నరు.