నవతెలంగాణ – ఆర్మూర్
ప్రతి పల్లెల్లో ఆగస్టు వరకు ఇండ్ల నిర్మాణం చేపడతాం అని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ను బారి మెజార్టీ తో గెలిపించాలని గురువారం దేగాం గ్రామంలో చాయ్ పే చర్చ మాచర్ల గ్రామంలో ఉపాధి హామీ కూలీలతో అన్నారు. ఎమ్మెల్యే గా అభివృద్ధి చేస్తాను ఆని దీనికి తోడు ఎంపీ గా అరవింద్ ఉంటే మరింత ఎక్కువ అభివృద్ధి జరుగుతుంది అని నిధులు ఎక్కువ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది అని, కాంగ్రెస్, బి అర్ ఎస్ నాయకుల మాటలు నమ్మి మోసోపోవద్దని ఇరువురు కుమ్మకు రాజకీయాలు చేస్తున్నారు ,వినయ్ రెడ్డి,జీవన్ రెడ్డి ప్రతి దాంట్లో కమిషన్ కి కక్కుర్తి పడుతున్నారు అభివృద్ధి అనేది వారి కుటుంబాలకు మాత్రమే అని అన్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే గా గెలిచినా నుండి అక్రమ కేసులు బెదిరింపు రాజకీయాలు లేవు అని స్వేచ్ఛ వాతావరణం ఉంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అసెంబ్లి కన్వీనర్ పలెపు రాజు,బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ విజయ భారతి,,నుతులా శ్రీనివాస్, కంచెట్టి గంగాధర్,,కలిగోట్ గంగాధర్ తదితరులు పాల్గోన్నారు.