నవతెలంగాణ – ఆర్మూర్
పేద ప్రజల సంక్షేమాటికి నిర్విరామ కృషి చేస్తానని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. పట్టణంలోని రైతు వేదిక యందు సోమవారం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించినారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ.. గత పాలకుల అరాచకాలు అవినీతితో పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఇకనుంచి అటువంటివి ఉండబోవని అన్నారు. పేద ప్రజల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి ,షాదీ ముబారక్ పుట్టింటి ఆడబిడ్డలకు ఎంతో ఉపయోగమని అన్నారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చే ప్రతి పైసా మీదే అని గమనించాలని అన్నారు. డబ్బు ఉన్నవారికి పెన్షన్ రావడం, పేదవారికి రాకపోవడం ఇకముందు జరగబోవు అని, ఉమ్మడి జిల్లాలోని బాన్సువాడలో పదివేల ఇండ్లు కట్టిన గత ప్రభుత్వం ఆర్మూర్ ఒక్క ఇల్లు పేదవారికి ఇవ్వలేదని అన్నారు. రెవెన్యూ, పోలీస్ ఇతర ఏ అధికారులు అయినా సరే తమ విధులను సక్రమంగా నిర్వహించాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రజల సొమ్ముతో జీతాలు పొందుతున్నారని, ప్రజలకు పనిచేయని వాళ్లు రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా వదిలేది లేదని అన్నారు. పేదవాళ్లను ఇబ్బందులకు పెట్టవద్దని అన్నారు.. ఈ కార్యక్రమంలో ఆలూరు ఎమ్మార్వో నరేష్,, డిటి హరీష్,, మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ మున్న,, కౌన్సిలర్లు సుంకరి రంగన్న ,ఆకుల రాము, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.