కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు సంతోష్ మేస్త్రి ఇంట్లో గురువారం రాత్రి నిర్వహించిన దీపావళి వేడుకలకు జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మీ కాంతారావు హాజరై పూజల్లో పాల్గొంటూ టపాకాయలు కాల్చారు. ఎమ్మెల్యేకు సంతోష్ మేస్త్రి కుటుంబ సమేతంగా శాలువా పూలమాలలతో ఘనంగా సత్కరించారు. దీపావళి వేడుకలకు హాజరైనందుకు సంతోష్ మేస్త్రి కుటుంబ సభ్యులందరూ ఎమ్మెల్యేకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యే వెంటా నాయకులు హనుమాన్లు స్వామి, జావీద్ పటేల్, అమూల్, చిన్న షక్కర్గ దిగంబర్, గడ్డం వార్ లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.