జుక్కల్ లో రుణమాఫీ సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే..

MLA participated in loan waiver celebrations in Jukkal.నవతెలంగాణ – జుక్కల్

మండల కేంద్రంలో కాంగ్రేస్ పార్టీ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన  రెండులక్షల రూపాయల రుణమాఫీ నిధుల  విడుదల సంధర్భంగా రైతులతో కలిసి ముఖ్యమంత్రి చిత్ర పఠానికి పాలాభీషేకం చేసారు. ఈ సంధర్భంగా ప్రయివేట్  ఫంక్షన్ హల్  లో ఏర్పాటు  చేసిన కార్యక్రమంలో  ఎమ్మెలేే తోట లక్ష్మీకాంతారావ్  మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ని విమర్షిస్తున్న బీఈర్ఎస్ నాయకులు గతంలో ఇచ్చిన హమీలను తుంగలో తొక్కి  ప్రజలకు శఠ గోపం పెటలెదా అని ప్రశ్నించారు. దేశంలో ఎక్కడా కనివిని ఎరుగని రెండు లక్షల రూపాయల  రుణమాఫీ  చేయడం సహసమే అని, కాంగ్రేస్ పార్టీ మాటిస్తే తప్పక నెరవేర్చుతామని, రైతును రాజు చేస్తామని పేర్కోన్నారు. కార్య క్రమంలో  వర్కింగ్ ప్రసిడెంట్  వినోద్, నాగల్ గావ్ అనీల్ , గొల్ల హన్మండ్లు , రైతులు, నాయకులు తదితరులు పాల్గోన్నారు.