
ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి హైదరాబాద్ లో ఆదివారం పర్యటించారు. ఆయన పలు కార్యక్రమాలకు హాజరయ్యారు. భాగ్యనగరంలో మాజీ మహారాష్ట్ర , తమిళనాడు గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.