
ఉప్పునుంతల మండల కేంద్రంలోని శ్రీ చెన్నకేశవ కేదారేశ్వర ఆలయం అదేవిధంగా మండల పరిధిలోని కంసాన్పల్లి శ్రీరామ గట్టుపై భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా రథోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉప్పునుంతల మండల కేంద్రంలోని కేదారేశ్వర ఆలయం వద్ద మొట్టమొదటిసారిగా నూతన రథోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. రథోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి రథాన్ని లాగి భక్తులను ఉత్తేజపరిచారు. అనంతరం కంసాన్పల్లి శ్రీరామ గట్టు పై స్థానిక నాయకులు కమిటీ సభ్యులు ఆయన సన్మానించారు. ఉప్పునుంతల మండల కేంద్రంలోని రాష్ట్రస్థాయి వృషభ రాజుల బండలాగుడు పోటీలను ప్రారంభించారు. టన్ను, రెండు టన్నుల బండల పోటీలు గురువారం ,శుక్రవారం కొనసాగనున్నాయి. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కట్ట సరితా రెడ్డి, మండల నాయకులు కట్ట అనంత రెడ్డి, ఎంపీపీ తిప్పర్తి అరుణ నర్సింహారెడ్డి, ప్రశాంత్ రెడ్డి,తిరుపతయ్య, రామచంద్రయ్య కమిటీ సభ్యులు,ఆయా గ్రామాల ప్రజలు, మారుమూల ప్రాంతాల నుండి ప్రజలు అధిక సంఖ్యలో వచ్చి ఆసక్తితో ఈ కార్యక్రమాలలో పాల్గొన్నారు.