
గుండాల, ఆళ్ళపల్లి మండలాల్లో పలు వివాహ వేడుకల్లో, శుభకార్యాలకు పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శనివారం హాజరయ్యారు. ముందుగా ఆళ్ళపల్లి మండల పరిధిలోని రాఘవపురం, మర్కోడు గ్రామాల్లో నూతన వధూవరులు నవీన్ -రేష్మ, కళ్యాణ్ – సౌమ్యల వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి నూతన వస్త్రాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం గుండాల మండల కేంద్రానికి చెందిన కోఆపరేటివ్ డైరెక్టర్ షేక్ సాబీర్ కనిష్ట పుత్రుడు షేక్ ఇస్రార్ నవ దంపతుల ఇంటికి చేరుకుని, నూతన వస్త్రాలను అందించి, శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే కొడవటంచ గ్రామంలో ఓ శుభకార్యానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పాత గుండాల మండలంలోని పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.