డాక్టర్ బాలు కు జాతీయ సేవా పురస్కారాన్ని అందజేసిన ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు..

నవతెలంగాణ –  కామారెడ్డి 
జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం చిలకలూరిపేటలో నిర్వహించిన జాతీయ సేవా పురస్కారం 2025 ను డాక్టర్ బాలు కు చిలకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు, ఆంధ్రప్రదేశ్ పర్యావరణ నిర్వహణ కార్పోరేషన్ చైర్మన్ పొలంరెడ్డి దినేష్ రెడ్డి లు అందజేశారు. ఆపదలో ఉన్నవారికి సకాలంలో రక్తాన్ని అందజేస్తూ,వ్యక్తిగతంగా 75 సార్లు రక్తదానం చేయడమే కాకుండా,తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం నాలుగు వేల యూనిట్ల రక్తాన్ని సేకరించి ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కించుకున్నందుకు గాను ఈ పురస్కారాన్ని డాక్టర్ బాలు పొందడం జరిగింది.