రాజకీయాల్లో హుందతనం ఉండాలి : ఎమ్మెల్యే పాయల్

There should be sobriety in politics: MLA Payalనవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
మూప్పై సంవత్సరాల తన రాజకీయ జీవితంలో ఎన్నడూ కూడా చిల్లర రాజకీయాలు, వ్యక్తిగతంగా దుషనాలు చేయలేదని, రాజకీయాల్లో హుందతనం ఉండాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి కంది శ్రీనివాస్ రెడ్డి చేసిన ఆరోపణలను ఆయన శనివారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఖండించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల శంకర్ మాట్లాడుతూ… బీసీలు రాజకీయంగా ఎదుగుతుంటే చూసి ఓర్వలేక ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తను రాజకీయాల్లో ఉన్నంత మాత్రన తన చుట్టూ పక్కాల వారికి ఆస్తులు వస్తే తన ప్రమేయం ఉందని చెప్పాడం హస్యస్పాదంగా ఉందన్నారు. ఇరిగేషన్ కు సంబంధించిన భూమిని కబ్జా చేసి షెడ్డును నిర్మించారని ఆరోపించారు. తాను ఎమ్మెల్యేగా పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్కలను కలిసి నియోజకవర్గ అభివృద్ది కోసం మాట్లాడడం జరిగిందన్నారు. దీనిపై వారు సానుకూలంగా స్పందించడంతో వారికి ధన్యవాదలు చెప్పడం మంచి పనులు చేస్తున్నందుకు పొగడడం తన తప్ప అని ప్రశ్నించారు. దీన్ని సాకులగా చూపి తాను కాంగ్రెస్ లో చేరుతున్నట్లు దుష్ప్రచారం చేసే ప్రయత్నాలు మానుకోవాలని హితవు పలికారు. గతంలో ఇక్కడ ఎమ్మెల్యేలుగా పదవులు సాగించిన రాంచంద్రారెడ్డి, వామన్ రెడ్డిలు భౌతికంగా లేకపోయిన ఇప్పటికి వారంటే గౌరవం ఉందన్నారు. వారు ఎన్నడు కూడా చిల్లర రాజకీయాలు, వ్యక్తిగత దుషణాలు చేయలేదన్నారు. మరోసారి తనపై ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు. తను అవినీతికి పాల్పడితే కాంగ్రెస్ అధికారంలో ఉందని, విచారణ జరిపించాలని సూచించారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షులు బ్రహ్మానందం, నాయకులు ఆదినాథ్, నగేష్, రత్నాకర్ రెడ్డి, రమేష్, వేణుగోపాల్, లాలా మున్నా, ఆకుల ప్రవీణ్, సోమరవి, జోగురవి, రాజేష్, రఘుపతి, శ్రీనివాస్, సుభాష్, దయాకర్, రాష్ట్రపాల్, బోయర్ విజయ్, భీం సేన రెడ్డి, రవి రెడ్డి, వేద వ్యాస్, మహేందర్ నాయకులు ఉన్నారు.