మిషన్ భగిరథలో వేల కోట్లు జేబుల్లోకి: ఎమ్మెల్యే

– మతం, రాముడిని అడ్డుపేట్టుకోని బీజేపీ నాటకం..
నవతెలంగాణ – డిచ్ పల్లి
విద్యా, ఉపాధి కావాలని, ఈసారి కాంగ్రెస్ నినాదం రాముని మొక్కుదం బిజెపి ని తోక్కుదం అనే నినాదంతో ప్రజల్లోకి వేళ్తున్నామని,ఈ సారి బీజేపీ ప్రభుత్వం వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని చేప్తున్నారని, ఎస్సీ ఎస్టీ లకు ఉన్న రిజర్వేషన్ పోతుందని అలా జరగకుండా ప్రజలు ఏకతాటిపైకి రావాలని, అయోధ్య లో రామ్ మందిరంలో విగ్రహాల ప్రతిష్టాపన జరగక ముందే బాల రాముని పేరు మీద గ్రామాల్లో అక్షింతలు పంపిణీ చేసి మతం, రాముని పేరుతోనే ఓట్లు దండుకోవడానికి చేస్తున్న నాటకమని, మేము కూడా రామ్ భక్తులే నని,పసుపు బోర్డు పేరుతో ఎంపీ ఆర్వింద్ జిల్లాకు చేసింది శూన్యమేనని, ఎంపీలుగా పనిచేసిన ఇద్దరు జిల్లాను ఎలాంటి అభివృద్ధి చేయలేదని, పోటీలో ఉన్న అర్వింద్, కవిత మాదిరిగానే ఆశాభంగం కలుగుతుందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి అన్నారు.  మంగళవారం డిచ్ పల్లి మండలం లోని ఖిల్లా డిచ్ పల్లి సహకార సొసైటీ పరిధిలోని యానాం పల్లి గ్రామంలో శ ఏర్పాటు చేసిన వరి కోనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులతో వివరాలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం శ్రీ కాంత్ ఏర్పాటు చేసిన ఎస్ వి అల్కలిన్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి మాట్లాడుతూ.. వరి ధాన్యాన్ని ప్రభుత్వం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తుందని రైతన్నలు ఏలాంటి ఆందోళన, దిగులు చేందోద్దని, ఎళ్ళవేళల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతంగా చేయాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటది వెంట రైస్ మిల్లులకు చేర్చాలని, రైతులకు 48 గంటల్లోనే రైతుల బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు జామ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో దళారులదే రాజ్యం నడిచిందన్నారు. కల్వకుంట్ల కవిత లిక్కర్  స్కాం లో పట్టుబడి జైళ్ళో ఉన్నారని,తండ్రి కెసిఆర్ దరణి భూములు అమ్ముకున్నారని, కోడుకు కెటిఆర్ పరీక్ష పేపర్లు అమ్ముకున్న రాని ఆరోపించారు. గత ఐదేళ్ల క్రితం ఎంపి అభ్యర్థి ధర్మపురి అర్వీంద్  పసుపు బోర్డు తెస్తానని చేప్పి, రైతులకు మోసం చేసి పసుపు బోర్డ్ పేపర్ మీద మాత్రమే ఉందని,ఏ గ్రామంలోనైన ఒక్క రూపాయి ఇవ్వకుండా,ప్రజల కష్టసుఖాల్లో కూడా పలు పంచుకోలేదని అలాంటి వ్యక్తికి మరోసారి ఓటు వేసి వృదా చేయోద్దని సూచించారు. కాంగ్రెస్ వాస్తే కరెంట్ ఉండదని తండ్రి కోడుకులు అవాకులు చవాకులు పేలుతున్నరని, వారు పదేళ్లు అదికారంలో ఉన్నప్పుడు ఏం చేశారని పేర్కొన్నారు.కళేశ్వరం పేరుతో లక్షల కోట్లు తమ జేబులో వేసుకున్నారని,మేడిగడ్డ కుంగి పోయిందని, మిషన్ భగిరథ నీరు ఎం ఒక్కరూ తాగడం లేదని,అ నీరు స్నానం ,ఇతర వాటికి ఉపయోగించాలని ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి తెలిపారు.
ప్రధాన మంత్రి మోదీ గుజరాత్ కు చెందిన బడా వ్యాపారస్తులకు అండగా ఉండి కోట్లాది రూపాలయను బ్యాంకు ల నుండి రూణలు పోంది బయటి దేశాలకు పారిపోయారని, మొత్తం 19మంది ఎగవేతదారుల్లో 18 గుజరత్ కు చెందిన వారే నన్నారు. ప్రతి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని నిరుద్యోగులకు ప్రధాని మోదీ మోసం చేశారని గుర్తుచేశారు. 95% గుజరాత్ కు చెందిన వారే దేశాన్ని దోచుకున్నారని, మరోసారి అవకాశం ఇస్తే ఏమి మిగలకుండా మొత్తం గుజరాతీ లకు కట్టబెడతరని  మోది కు నమ్మోద్దని సూచించారు. మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ పై విమర్శలు చేశారు.భారాస, భాజపా పార్టీలతో అభివృద్ధి సాధ్యపడ దన్నారు. కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు.అంతకు ముందు పలువురు కాంగ్రెస్ పార్టీ లో చేరారు.ఈ సమావేశంలో సహకార సొసైటీ చైర్మన్ రంచందర్ గౌడ్, వైస్ చైర్మన్ కుమ్మరి చిన్న గంగారం, సిఈఓ కిషన్,ఇందల్ వాయి కాంగ్రెస్ మండల అధ్యక్షులు మోత్కురి నవీన్ గౌడ్, మాజీ ఎంపీపీ కంచెట్టి గంగాధర్, డైరెక్టర్ రాజేశ్వర్, డాక్టర్ శాదుల్లా, డాక్టర్ జాహుర్, దాసరి రాము, డైరెక్టర్లు,మండల నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.