
నవతెలంగాణ – కమ్మర్ పల్లి
వేల్పూర్ మండల కేంద్రంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో బాల్కొండ నియోజక వర్గానికి చెందిన ఆరుగురు దివ్యాంగులకు మోటార్ సైకిళ్లను ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అందజేశారు. నాలుగురికి రెట్రో ఫిట్టేడ్ మోటరైజ్డ్ వాహనాలు, ఇద్దరికీ బ్యాటరీ ఆపరేటర్ వీల్ చైర్ లు అందజేశారు. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపి ప్రశాంత్ రెడ్డి మాట్లాడారు. బాల్కొండ నియోజకవర్గంలో ఇంకా అనేక మంది అర్హులైన వికలాంగులు ఉన్నారని, వారందరికీ వాహనాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరినట్లు చెప్పారు. ఇందుకోసం మంత్రిని కలిసి విన్నవించనున్నట్లు ప్రశాంత్ రెడ్డి తెలిపారు. వాహనాలు తీసుకున్న లబ్దిదారులు వాటిని జాగ్రత్తగా వినియోగించుకోవాలని సూచించారు.ఈ సందర్భంగా అంగన్ వాడి టీచర్లకు, హెల్పర్లకు డ్యూటీ చీరలు పంపిణీ చేశారు.నియోజకవర్గంలోని భీంగల్ ప్రాజెక్ట్ లో 47 మినీ అంగన్వాడి టీచర్లను మెయిన్ టీచర్లుగా గుర్తించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి అధ్యక్షురాలు బీమా జమున, ఉపేందర్, వైస్ ఎంపిపి సురేష్, జిల్లా ఆర్టిఓ మెంబర్ రాములు, సామ మహిపాల్, తహసిల్దార్ నాగేశ్వరరావు, ఎంపిడిఓ కరుణాకర్, భీంగల్ ఐసిడిఎస్ సీడీపీఓ సుధారాణి, ఏసీడీపీఓ జ్ఞానేశ్వరి, కో ఆర్డినేటర్ విజయలక్ష్మి, బాల్కొండ నియోజకవర్గము డిసేబుల్ వింగ్ కిరణ్, అంగన్వాడీ టీచర్లు, కార్యకర్తలు, నాయకులు పాల్గోన్నారు.