నవతెలంగాణ – భీంగల్ రూరల్
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో సుదర్శన్ నగర్,సంతోష్ నగర్ తాండలను నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేసుకున్నాం. రాష్ట్రంలో తాండలను గ్రామపంచాయతీలుగా మార్చిన వాటిలో అతి చిన్న గ్రామపంచాయతీలు కావచ్చు అని అన్నారు. రూ.20 లక్షలతో సంతోష్ నగర్ తండా,సుదర్శన్ నగర్ తండా లో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాలను ప్రారంభించారు. అలాగే నియోజకవర్గానికి ఒక బంజారా భవనం కావాలన్న బంజారాల కోరిక మేరకు ఆనాటి ప్రభుత్వం కేసీఆర్ సహకారంతో రూ.50 లక్షలతో భీంగల్ లో బంజారా భవనాన్ని మంజూరు చేసుకొని గత ప్రభుత్వ హయాంలోనే భవన నిర్మాణం పూర్తి చేసుకున్నాంమని అన్నారు. బంజారా భవనం ప్రారంభం రోజు మళ్ళీ ఈ భవనానికి కాంపౌండ్ వాల్ కావాలి అని కోరడంతో ఇప్పుడు ఎమ్మెల్యే సిడిపి నిధుల నుండి 17 లక్షలు మంజూరు చేసి ఈ రోజు శంకుస్థాపన చేయడం జరిగింది.