ఎంపీ సురేష్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి

MLA Prashant Reddy met MP Suresh Reddyనవతెలంగాణ – కమ్మర్ పల్లి
రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేష్ రెడ్డిని, మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నుకోబడి పార్లమెంట్ సమావేశాల అనంతరం హైదరాబాద్ చేరుకున్న  రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డిని ఆయన నివాసంలో ప్రశాంత్ రెడ్డి  మర్యాదపూర్వకంగా కలిశారు. బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేతగా నియామకమైనందుకు హర్షం వ్యక్తం చేస్తూ సురేష్ రెడ్డిని, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి శాలువాతో సత్కరించి, పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.