వాడపల్లి లో ఎమ్మెల్యే పూజలు..

నవతెలంగాణ- దామరచర్ల
దామరచర్ల మండలంలోని వాడపల్లి  శ్రీ మీనాక్షి అగస్తేశ్వర స్వామీ దేవాలయంలో  బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమోతు భాస్కర్ రావు తో పాటు సతీమణి  జయ, కుమారులు చైతన్య, సిద్దార్థ లు మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారికి అభిషేకాలు చేసారు, ఈ సందర్భంగా ఆలయ పూజారులు, ఆలయ కమిటీ సభ్యులు, ఘన స్వాగతం పలికారు. భాస్కర్ రావు దంపతులను వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య శాలువాలతో సత్కరించారు దర్శనానంతరం వేదపండితులు భాస్కర్ రావు దంపతులకు ఆశీర్వచనం అందించారు, ఆలయ చైర్మన్ కొందుటి సిద్దయ్య వారికీ తీర్థప్రసాదాలను అందజేశారు..