గల్ఫ్‌ బాధితునికి అండగా ఎమ్మెల్యే రామారావు పటేల్‌

గల్ఫ్‌ బాధితునికి అండగా ఎమ్మెల్యే రామారావు పటేల్‌నవతెలంగాణ-భైంసా
ఏజెంట్‌ మాయమాటలకు మోసపోయిన ముధోల్‌ మండలం రువి గ్రామానికి చెందిన రాథోడ్‌ నాందేవ్‌కు ఎమ్మెల్యే అండగా నిలిచాడు. కువైట్‌లోని ఎడారి ప్రాంతంలో చిక్కుకుపోయిన నాందేవ్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే పవార్‌ రామారావు పటేల్‌ సంబంధిత కేంద్ర మంత్రితో మాట్లాడారు. అదేవిధంగా ఈ విషయాన్ని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజరుకి తెలిపారు. త్వరలోనే బాధితున్ని తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేయనుంది. కూతురు పెళ్లికి అప్పులు కావడంతో అవి తీర్చడానికి కువైట్‌ వెళ్లిన బాధితుడు మండుటెండలో ఒంటెలు కాస్తూ విలవిల్లాడుతున్నాడు.